పారిశుద్ధ్య కార్మిక ‌కుటుంబాలను ఆదుకోవాలి: ఇస్లావత్ దశరత్ నాయక్

నమస్తే శేరిలింగంపల్లి: మ్యాన్ హోల్ లో పడి మృతి చెందిన పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఆల్ ఇండియా బంజార సేవా సంఘ్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ఇస్లావత్ దశరత్ నాయక్ డిమాండ్ చేశారు. వనస్థలి పురం సాహెబ్ నగర్ పరిధిలో పద్మావతి‌నగర్ కాలనీలోని డ్రైనేజీ ని ఈ నెల 3 న శివ, అంతయ్య అనే పారిశుద్ధ్య కార్మికులు శుభ్రం చేస్తుండగా మ్యాన్ హోల్ లో పడి మృతి చెందడం బాధాకరమని అన్నారు. మృతుల కుటుంబాలను ఏ ఒక్క అధికారి పరామర్శించకపోవడంతో పాటు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. మృతి చెందిన దళితులకు దళిత బంధు పథకం ద్వారా రూ. 10 లక్షలు అందజేసి ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం, డబుల్ బెడ్ రూం ఇళ్లను మంజూరు చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

బంజార సేవా సంఘ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇస్లావత్ దశరత్ నాయక్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here