నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని సురభి కాలనీలో ప్రభుత్వ ఇంగ్లీషు మీడియం స్కూల్ ఆవరణలో చైల్డ్ ఫండ్ ఇంటర్నేషనల్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంలో శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లి పాలు పిల్లలకు రోగ నిరోధక శక్తి పెంచేందుకు ఎంతగానో దోహదపడుతాయని అన్నారు. పిల్లలకు ముర్రు పాలు తాగించటం వల్ల పిల్లలలో అధిక ప్రోటీన్లు, పోషక విలువలు వృద్ధి చెంది పిల్లల ఎదుగుదలకు తోడ్పడుతుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం గర్భిణీ స్త్రీలకు,పిల్లలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తుందని అన్నారు. తల్లిపాల వారోత్సవాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తల్లిపాల పైన అవగాహన కల్పిస్తున్న చైల్డ్ ఫండ్ ఇంటర్నేషనల్, ఐసీడీఎస్ సంస్థ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ మోతి, సీడీపీఓ లక్ష్మి భాయ్, చైల్డ్ ఫండ్ ఇంటర్నేషనల్ సూపర్ వైజర్ జ్యోతి, చైల్డ్ ఫండ్ ప్రాజెక్టు ఆఫీసర్ ప్రకాష్ రెడ్డి, చైల్డ్ ఫండ్ సీనియర్ ఆఫీసర్ శ్రీశైలం, హెల్త్ కో-ఆర్డినేటర్ దివ్య, వార్డు మెంబర్ శ్రీకళ, అంగన్ వాడి టీచర్లు జయప్రియ, మాధవి, లక్ష్మీ, అనురాధ, కనకదుర్గ, నాయకులు దీప, కళ్యాణీ, సుధారాణి, నాయకులు పట్లోళ్ల నర్సింహారెడ్డి, సాయి, రామచందర్, అంగన్ వాడి వర్కర్లు, చైల్డ్ ఫండ్ ఇంటర్నేషనల్ సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.