నమస్తే శేరిలింగంపల్లి: బిజెపిని బూత్ స్థాయి నుంచి పటిష్టవంతం చేసుకోవాలని, ప్రతీ కార్యకర్త సైనికునిలా పనిచేయాలని సీనియర్ నాయకులు వనపల్లి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షులు రాజు శెట్టి కురుమ అధ్యక్షతన ఆదివారం దూబేకాలనీలో నిర్వహించిన డివిజన్ కార్యవర్గ సమావేశానికి రంగారెడ్డి అర్బన్ జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి చింతకింది గోవర్ధన్ గౌడ్, సీనియర్ నాయకులు వనపల్లి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. కోవిడ్ కష్ట కాలంలో బిజెపి కార్యకర్తలు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అర్హులైన పేదలకు చేసిన సేవలను వారు కొనియాడారు. రాబోయే హుజూరాబాద్ ఉప ఎన్నికలో ప్రతి ఒక్క బిజెపి కార్యకర్త సైనికుడిలా పని చేసి పార్టీని విజయపథంలో నడిపిస్తారని నమ్మకం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బిజెపి నాయకులు వివిధ సమస్యలైన స్థానిక కార్పొరేషన్ ఫంక్షన్ హాల్ నిర్వహణ, మోడల్ రైతు బజార్ అభివృద్ధి, వర్ష కాలం లో డ్రైనేజ్, రోడ్, కాలువలు పరిస్థితి పై, వాటి పరిష్కారానికై, డివిజన్ లో టీ.అర్.ఎస్ నాయకుల కబ్జాల పై, అర్హులైన పేదవారికి డబుల్ బెడ్ రూం ఇళ్ల కేటాయింపు పై, రేషన్ కార్డ్ ల కేటాయింపు పై, ప్రైవేట్ స్కూల్ ల అధిక ఫీజు దోపిడీ పై పలు రాజకీయ తీర్మానాలు చేసి ఆమోదించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఇంచార్జీ ఆది నారాయణ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్, రాష్ట్ర దళిత మోర్చా అధికార ప్రతినిధి కాంచన కృష్ణ, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంఛార్జి గజ్జల యోగానంద్, రంగారెడ్డి అర్బన్ జిల్లా అధికార ప్రతినిధి మారం వెంకట్, కోశాధికారి రమేష్ సోమిసెట్టీ, డివిజన్ కంటేస్టడ్ కార్పొరేటర్ కంచర్ల ఎల్లేష్, డివిజన్ ప్రధాన కార్యదర్శులు చిట్టా రెడ్డి ప్రసాద్, సత్య కుర్మా, ఉపాధ్యక్ష్యులు బాలరాజు, భీమాని విజయ లక్ష్మి, భీమాని సత్య నారాయణ, సీనియర్ నాయకులు రాఘవేందర్ రావు, శాంతి భూషణ్ రెడ్డి, నీరటి చంద్ర మోహన్, కుమార్ యాదవ్, భారత్ రాజ్, అరుణ కుమారి, ఎల్లేష్ కురుమ, శ్రీకాంత్, గాయత్రి, బబ్లీ దేవి, అంజు గుప్త, అంకమ్మ, సాయి వెంకట్, నీలకంఠ రెడ్డి మరియు బిజెపి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్య లో పాల్గొన్నారు.