నమస్తే శేరిలింగంపల్లి: ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు ఆపన్నహస్తం లాంటిదని ప్రభుత్వ విప్, శాసన సభ్యులు ఆరెకపూడి గాంధీ అన్నారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని భిక్షపతి నగర్ కి చెందిన శివాజీ అత్యవసర చికిత్స నిమిత్తం ఆసుపత్రి బిల్లుల పరిహారార్ధం సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకొనగా ముఖ్య మంత్రి సహాయ నిధి ఎల్ ఓ సీ ద్వారా మంజూరైన రూ. 3 లక్షల చెక్కును బాధిత కుటుంబానికి కార్పొరేటర్లు జగదీశ్వర్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్, నార్నె శ్రీనివాసరావు, హోప్ ఫౌండేషన్ ఛైర్మెన్ కొండా విజయ్ తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పేదలకు గొప్ప వరం లాంటిదన్నారు. ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, ఆల్విన్ కాలనీ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జిల్లా గణేష్ తదితరులు పాల్గొన్నారు.