నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నూతన శానిటేషన్ సూపర్వైజర్గా బాధ్యతలు చేపట్టిన జలందర్ రెడ్డిని తెలంగాణ మునిసిపల్ ఔట్సోర్సింగ్ ఉద్యోగ, కార్మిక సంఘం నాయకులు మర్యాద పూర్వకంగా కలిశారు. ఆదివారం జేఏసి చైర్మెన్ తిప్పర్తి మహేస్ ఆధ్వర్యంలో జలంధర్రెడ్డిని కలిసిన ఔట్ సోర్సింగ్ సిబ్బంది శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు నాగేశప్ప, కిష్టప్ప, గ్రేటర్ ఉపాధ్యక్షుడు అచ్యుత్ శేరిలింగంపల్లి సర్కిల్ అధ్యక్షుడు యాదన్న, సహాయ కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, చిన్న తదితరులు పాల్గొన్నారు.