నమస్తే శేరిలింగంపల్లి: విధులకు హాజరవుతూ ప్రమాదానికి గురై గాయపడి చికిత్స పొందుతున్న శేరిలింగంపల్లి సర్కిల్ ఎస్ఎఫ్ఎ అవినాష్ కు తెలంగాణ మున్సిపల్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగ,కార్మిక సంగం సభ్యులు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. యూనియన్ చైర్మెన్ తిప్పర్తి మహేష్ ఆధ్వర్యంలో అవినాష్ ను పరామర్శించిన సభ్యులు రూ. 15వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. దీంతో పాటు ఆసుపత్రి యాజమాన్యంతో చర్చించి బిల్లులో రూ.25వేల రాయితీ ఇప్పించి, అందుకు సహకరించిన ఎఎమ్ఒహెచ్ రవికుమార్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు నాగేశప్ప, ఉపాధ్యక్షుడ్లు బిక్షపతి, అచ్యుత్ సర్కిల్ అధ్యక్షుడు యాదయ్య ప్రధానకార్యదర్శి మల్లేష్ కుమార్, జోన్ వర్కింగ్ ప్రెసిడెంట్ నరసింహ తదితరులు పాల్గొన్నారు.