వ‌ల‌స కూలీల కోసం హెచ్‌సియు అధ్యాప‌కులు చేస్తున్న కృషి అభినంద‌నీయం: రాగంనాగేంద‌ర్ యాద‌వ్‌

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: క‌ర్ణాట‌క ప్రాంతం నుండి వ‌ల‌స‌వచ్చి హైద‌రాబాద్ న‌గ‌రంలో జీవ‌నం సాగిస్తున్న వ‌ల‌స కూలీల కోసం హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివర్సీటీ అధ్యాప‌కులు చేస్తున్న కృషి అభినంద‌నీయ‌మ‌ని శేరిలింగంప‌ల్లి డివిజ‌న్ కార్పొరేటర్ రాగంనాగేంద‌ర్ యాద‌వ్ అన్నారు. ఆదివారం గోపిన‌గ‌ర్ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో హెచ్‌సియు ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించ‌బోయే లాంగ్ ట‌ర్మ్ లిట‌ర‌సీ ట్రైనింగ్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ కాగ్నిటివ్ ఫంక్ష‌నింగ్ ప్రాజెక్టును రాగం ముఖ్యఅతిథిగా హాజ‌రై ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా రాగం మాట్లాడుతూ ప్రాజెక్టులో కర్ణాటక నుంచి తెలంగాణకు వలస వచ్చిన కూలీల‌కు 8 నెలల పాటు తెలుగు రాయడం, చదవడం నేర్పిస్తూ వారి పనితనాన్ని గ‌మ‌నిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమం కోసం యూనివర్సిటీ ప్రొఫెసర్ రమేష్ కుమార్ మిశ్రా, ఆయ‌న విద్యార్థి బృందం కోఆర్డినేటర్ వైష్ణవి, సీమ ప్రసాద్, ఫణి కృష్ణ, తదితరులు కార్య‌క్ర‌మ ఏర్పాట్లు చేయ‌నున్నార‌ని తెలిపారు. ఈ కార్య‌క్ర‌మానికి త‌న స‌హ‌య స‌హ‌కారాల‌ను అందించేందుకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాన‌ని ఆయ‌న తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో సామాజిక సేవ రత్న అవార్డు గ్రహీత భేరీ రామచందర్ యాదవ్, రవీందర్ యాదవ్, వీరేశం గౌడ్, నరసింహ, ప్రభాకర్ సైదులు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

కార్య‌క్ర‌మ ప్రారంభోత్స‌వంలో మాట్లాడుతున్న కార్పొరేట‌ర్ రాగం నాగేంద‌ర్‌యాద‌వ్‌
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here