ఘనంగా వరల్డ్ రెడ్ క్రాస్ డే వేడుకలు… చందానగర్ జిహెచ్ఎంసి కళ్యాణమండపంలో రక్తదాన శిబిరం…

నమస్తే శేరిలింగంపల్లి: వరల్డ్ రెడ్ క్రాస్ డే వేడుకలను పురస్కరించుకొని చందా నగర్ లోని జిహెచ్ఎంసి కళ్యాణ మండపంలో శనివారం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రోటోడైన్ సంస్థ సౌజన్యంతో నిర్వహించిన ఈ శిబిరంలో 20 మందికి పైగా దాతలు తమ రక్తాన్ని దానం చేశాను. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న చందానగర్ సర్కిల్ ఉప కమిషనర్ సుధాంష్ నందగిరి మాట్లాడుతూ కరుణ విలయతాండవం చేస్తున్న వేళ రక్త నిల్వలు లేక రోగులు అవస్థలు పడుతున్నారని, ఈ క్రమంలో ఇలాంటి శిబిరాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఉప వైద్యాధికారి డాక్టర్ కార్తీక్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రంగారెడ్డి జిల్లా చైర్మన్ ఎస్.నరసింహారెడ్డి, వైస్ చైర్మన్ వీ పాండు, రోటోడైన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధినేత కె.మధుసూదన్ రెడ్డి వారి సిబ్బంది పాల్గొన్నారు.

శిబిరంలో పాల్గొన్న చందానగర్ డీసి సుధాంష్, రెడ్ క్రాస్ సొసైటి ప్రతినిధులు నరసింహారెడ్డి, పాండు, రోటోడైన్ అధినేత మధుసూదన్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here