నమస్తే శేరిలింగంపల్లి: శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని హఫీజ్పేట్ డివిజన్ ఇంద్రారెడ్డి ఆల్విన్ కాలనీ దేవాలయంలో సీతారాముల కళ్యాణం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జ్ఞానేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఆ సీతారామచంద్రుల కరుణా కటాక్షా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండేలన్నారు. యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి విముక్తి కలిగించాలని భగవంతున్న ప్రార్ధించినట్టు ఆయన తెలిపారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ అవసరం ఉంటె తప్ప బయటికి వెళ్ళవద్దని, ఒకవేళ వెళ్లిన తప్పనిసరిగా మాస్క్ ధరించి, భౌతిక దూరం పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.






