నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ లోని విశాఖ శ్రీ శారదా పీఠపాలిత వెంకటేశ్వర ఆలయ సముదాయంలో మంగళవారం శ్రీవారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. వెంకటేశ్వరస్వామి జన్మనక్షత్రమైన శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రధాన అర్చకులు, పీఠం తెలంగాణ రాష్ట్ర ఆగమ సలహాదారు సుదర్శనం సత్యసాయి పర్యవేక్షణలో అర్చనలు అభిషేకాలతో పాటు పద్మావతి గోదాదేవి సమేత శ్రీనివాసుడి కల్యాణం జరిపించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో శాంతి హోమం నిర్వహించారు. ఆలయ ఆలయ పాలక మండలి సభ్యులు, ఆలయ సిబ్బంది, పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని, తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు.