నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని జయప్రకాష్ నారాయణ నగర్ కాలనీలొ ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర కళ ప్రదర్శనను స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి ప్రదర్శనల వల్ల అటు చేనేత హస్త కళాకారులకు, ఇటు కాలనీల వాసులకు ఇరువురికి మేలు జరుగుతుందని అన్నారు. కరోనా కాలంలో తీవ్రంగా దెబ్బతిన్న కళాకారులకు ప్రోత్సాహం దక్కుతుందని, షాపింగ్ల కోసం దూరప్రాంతాలకు వెళ్లడం కంటే కాలనీలోనే ఏర్పాటైన ఇలాంటి ప్రదర్శనలు ఉత్తమమని అన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షలు అన్నె రాజు, రామాంజనేయురెడ్డి, రాఘవ రావు, వెంకట్ రెడ్డి, అశోక్ తదితరులు పాల్గొన్నారు.






