నమస్తే శేరిలింగంపల్లి: జాతీయ స్థాయి రోలర్ స్కేటింగ్ హాకీ పోటీల్లో చందానగర్ పీజేఆర్ స్టేడియం ఆర్నవ్ సంజయ్ లిఖార్ సత్తా చాటాడు. చండీఘడ్ సెక్టార్ 10లో 58వ జాతీయ రోలర్ స్కేటింగ్ హాకీ చాంపియన్‌షిప్ పోటీలు ఘనంగా జరిగాయి. అండర్ క్యాడెట్ బాయ్స్ క్వాడ్ క్యాటగిరీ పోటీల్లో తెలంగాణ జట్టు నుంచి ఆర్నవ్ సంజయ్ లిఖార్ ఫార్వర్ ప్లేయర్‌గా ప్రాతినిథ్యం వహించాడు. ఈ క్రమంలో తెలంగాణ జట్టు ఫైనల్ మ్యాచ్‌లో హర్యానాతో పోటీపడింది. పోటీలో అర్నవ్ మంచి ప్రదర్శనతో తెలంగాణ జట్టు 4-3 తేడాతో హర్యానాపై విజయం సాధించింది. ఈ సందర్భంగా తెలంగాణ జట్టు నుంచి అద్భుత ప్రతిభ కనబరిచిన పీజేఆర్ స్టేడియం క్రీడాకారుడు ఆర్నవ్ సంజయ్ లిఖార్‌ను, అతడికి నాణ్యమైన శిక్షణను అందించిన కోచ్ నవీన్‌లను స్టేడియం ఇన్చార్జీ, శేరిలింగంపల్లి జోనల్ స్టోర్ట్స్ అసిస్టెంట్ డైరెక్టర్ వీరానంద్ అభినందించారు.