నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని రామయ్య నగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన స్వరమహతి సంగీతాలయంను ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన ప్రాంతంలో సంగీతం నేర్చుకోవడానికి ఈ రోజు స్వర మహతీ సంగీతాలయ్‌ను ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం అన్నారు. అంతరించి పోతున్న కళలకు జీవం పోసి మన పిల్లలకు కళల పట్ల ఆసక్తి కలిపించి భవిష్యత్తులో ప్రపంచ ప్రఖ్యాతి గాంచె సంగీత విద్వాంసులను అందించే వేదిక కావాలని గాంధీ ఆకాక్షించారు. కార్యక్రమంలో మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, చందానగర్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, హఫీజ్‌పేట్ డివిజన్ అధ్యక్షులు గౌతమ్ గౌడ్, సీనియర్ నాయకులు మిరియాల రాఘవరావు, వాలా హరీష్ రావు, నాయినేని చంద్రకాంత్ రావు, కంది జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
ఒకేచోట సంగీతం, నృత్యం, యోగాలో శిక్షణ…
నిర్వాహకులు, ప్రముఖ సంగీత విద్వాంసులు, కళారత్న బంధనపూడి ఆదిత్య కిరణ్ మాట్లాడుతూ తమ స్వరమహతి సంగీతాలయంలో హిందుస్తాని మ్యూసిక్ వోకల్, తబలా, హర్మోనియం, కీబోర్డు, కర్ణాటక మ్యూసిక్ వోకల్, వీణా, ఫ్లూట్, వయోలిన్, లైట్ మ్యూసిక్, సెమీ క్లాసికల్, భక్తి సంగీతం అదేవిధంగా కూచుపూడి, భరతనాట్యం, కథక్, ఫ్రీస్టైల్, వెస్ట్రన్ డ్యాన్సులతో పాటు యోగాలోను శిక్షణ ఇస్తామని, డిప్లోమా, బీఏ, ఎంఏ లాంటి సర్టిఫికేట్ కోర్సులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. వివరాల కోసం ఫోన్ నెంబర్ 040-23023302, 9505123489లలో సంప్రదించాలని సూచించారు.