నమస్తే శేరిలింగంపల్లి:శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో నియోజకవర్గం అభివృద్ధి, భవిష్యత్ ప్రణాళికపై జోనల్ కమిషనర్ రవికిరణ్‌తో పాటు జీహెచ్ంఎసీ ఉన్నతాధికారులతో ప్రభుత్వ విప్ గాంధీ శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ అభివృద్ధి పనులలో వేగం పెంచాలని,పెండింగ్ పనులు పూర్తయ్యేలా చూడలని, రాబోయే వర్షకాలం ను దృష్టిలో పెట్టుకొని నాల విస్తరణ పనులు వేగవంతం చేయాలని అన్నారు నాలల విస్తరణ పనులలో భాగంగా మిగిలిపోయిన అసంపూర్తి పనులను వెంటనే పూర్తి చేయాలని, లోతట్టు ప్రాంతాలను దృష్టిలో పెట్టుకొని పనులు వేగవంతం చేయాలని అన్నారు. అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ వంటి మౌలిక వసతుల కల్పనలో శాశ్వత పరిష్కారం దిశగా పూర్తి స్ధాయిలో పనులు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ చిన్నారెడ్డి, ఈఈలు సుదర్శన్, శంకర్, సత్యనారాయణ , డీఈ రమేష్, ఏఎంఓహెచ్ రంజిత్ తదితరులు పాల్గోన్నారు.