నమస్తే శేరిలింగంపల్లి: ప్రముఖ రచయిత్రి కన్నేగంటి అనసూయకు ప్రభుత్వవిప్ ఆరెకపూడి గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. ఆమె రచించిన స్నేహితులు అనే లఘు కథ సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ నుండి బాలసాహిత్యం పురస్కారం వచ్చిన సందర్భంగా గాంధీ ఆమెను ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కన్నెగంటి అనసూయకు కేంద్ర సాహిత్య అకాడమీ నుండి అత్యున్నత పురస్కారం లభించడం తెలుగు జాతికే గర్వకారణమని అన్నారు. సరళమైన భాషలో చిన్నారులకు అర్థమయ్యేలా రాసే అనసూయ భవిష్యత్తులో మరిన్ని మంచి రచనలు మిక్కిలి పురస్కారాలు పొందాలని ఆకాక్షించారు. రచయితలకు తనవంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్, మాజీ కార్పొరేటర్ నరేంద్ర చారి, హోప్ ఫౌండేషన్ ఛైర్మెన్ కొండా విజయ్ కుమార్, జర్నలిస్ట్ పుట్ట వినయకుమార్ గౌడ్, నాయకులు గుడ్ల ధనలక్ష్మి, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
