నమస్తే శేరిలింగంపల్లి: పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి బోడ సునీల్ నాయక్ చిత్రపటానికి బిజెపి రాష్ట్ర నాయకులు ఎం.రవికుమార్ యాదవ్, గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్రెడ్డిలు ఘనంగా నివాళులర్పించారు. బిజెపి గిరిజన మోర్చా రంగారెడ్డి (అర్బన్) జిల్లా అధ్యక్షులు హనుమంతు నాయక్ ఆద్వర్యంలో గోపన్ పల్లి తాండాలో కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్, గంగాధర్ రెడ్డిలు మాట్లాడుతూ సునీల్ నాయక్ది ఆత్మహత్య కాదనికేసీఆర్ చేసిన హత్య అని విమర్శించారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ కళ్ళు తెరిచి ఖాళీగా ఉన్న లక్ష తొంబై వేల ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలనీ లేదంటే.. కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించారు. సునీల్ నాయక్ కు నివాళిగా ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని, తెలంగాణ ఉద్యమంలో బలిదానాల పాత్రను ఎవరూ తీసిపారేయలేరు అని అన్నారు.