నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్‌రెడ్డి బుదవారం జీహెచ్ఎంసీ శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ రవికుమార్‌తో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. డివిజన్‌లో నెలకొన్న సమస్యలు, కొనసాగుతున్న అభివృద్ధి పనులపై ప్రత్యేకంగా చర్చించారు. పెండింగులో ఉన్న పనులను వెంటనే ప్రారంభించి త్వరిత గతిన పూర్తయ్యేలా చూడాలని జోనల్ కమిషనర్‌ను కార్పొరేటర్ కోరారు. సానుకూలంగా స్పందించిన జడ్సీ రవికిరణ్ ప్రాధాన్యతా క్రమంలో సమస్యలన్నింటిని పరిష్కరించేలా చూస్తానని హామీ ఇచ్చినట్టు గంగాధర్‌రెడ్డి తెలిపారు.