- గచ్చిబౌలి డివిజన్ అభినందన సభలో ప్రభుత్వ విప్ గాంధీ, TUFIDC ఛైర్మన్ విప్లవ్ కుమార్
నమస్తే శేరిలింగంపల్లి: హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎన్నికల్లో తెరాస అభ్యర్థి వాణిదేవి విజయం సాధించిన సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ సీనియర్ నాయకులు శీనుపటేల్ ఆద్వర్యంలో బుదవారం అభినందన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (TUFIDC) ఛైర్మన్ విప్లవ్ కుమార్, కార్పొరేటర్ నార్నే శ్రీనివాస్ రావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. స్థానిక మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా అతిథులను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గాంధీ, విప్లవ్ కుమార్‌లు మాట్లాడుతూ సమిష్టి కృషి వల్లే ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవి విజయం సాదించిందని అన్నారు. పార్టీ గెలుపుకు కృషిచేసిన కార్యకర్తలకు వారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు, వార్డు మెంబర్లు, ఏరియా మేంబర్లు, గచ్చిబౌలి డివిజన్ ఎమ్మెల్సీ ఇన్చార్జులు పాల్గొన్నారు.