కొండాపూర్ ఏరియా హాస్పిటల్లో జనరిక్ మందుల దుఖాణం, బ్లడ్ బ్యాంకులను ప్రారంభించిన ప్రభుత్వ విప్ గాంధీ
నమస్తే శేరిలింగంపల్లి: కొండాపూర్ డివిజన్ పరిధిలోని ఏరియా హాస్పిటల్లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, రంగారెడ్డి జిల్లా శాఖ వారి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన జనరిక్ మందుల దుకాణం, బ్లడ్ బ్యాంక్‌లను ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ బుదవారం లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా గాంధీ మాట్లాడుతూ కొండాపూర్ ఏరియా ఆస్పత్రిలో జనరిక్ మందుల దుకాణం, బ్లడ్ బ్యాంక్‌లను ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమన్నారు. రెడ్ క్రాస్ సంస్థ సేవలు అమోఘమని, ఎంత కొనియడిన తక్కువే నని, సేవే లక్ష్యంగా ముందుకువెళ్తున్నారని అన్నారు. ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చే పేద, మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధర గల నాణ్యమైన మందులు లభించునని, దీని ద్వారా ప్రజలకు ఆర్థిక భారం తగ్గునని అన్నారు. ప్రస్తుతం బ్లడ్ బ్యాంకుల్లో రక్తం తగ్గిపోతుండడంతో తలసేమియా, ఇతరత్రా వ్యాధి గ్రస్తులకు రక్తం ఉపయోగపడుతుందని అన్నారు. రక్త దాతలు ముందుకు వచ్చి రక్తదానం చేయడం చాలా గొప్ప విషయమని, అన్ని దానాల కన్న రక్త దానం గొప్పది అని, రక్తదానం చేయడానికి ముందుకు వచ్చిన దాతలను ఆయన ప్రత్యేకంగా అభినదించారు. అనంతరం వైద్య సిబ్బందికి మాస్క్ లు, సబ్బులు, శాని టైజర్లు పంపింణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెలంగాణ జనరల్ సెక్రటరీ, సీఈఓ మదన్ మోహన్ రావు, కోటి రెడ్డి, ఎంసీ మెంబర్ శ్రీనివాస్, ఐఆర్సీఎస్ రంగారెడ్డి ఛైర్మెన్ నర్సింహ రెడ్డి, వైస్ చైర్మన్ పాండు, రాఘవరెడ్డి, డిప్యూటీ కలెక్టర్ వంశీ మోహన్, RI చంద్రారెడ్డి, సూపర్డెంట్ దశరథ్, మాజీ కార్పొరేటర్ రవి ముదిరాజు, డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు కృష్ణ గౌడ్, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, నాయకులు ఉట్ల కృష్ణ , చాంద్ పాషా, భాస్కర్ రెడ్డి, తిరుపతి, నరేష్, తిరుపతి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.