నమస్తే శేరిలింగంపల్లి: బీసీ విద్యార్థులకు తీరని అన్యాయం జరుగుతుందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు భేరీ రామచందర్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. జనాభాలో 50 శాతంపైన ఉన్న బీసీ విద్యార్థులకు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 200 గురుకుల పాఠశాలలు మాత్రమే ఉన్నాయని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఐదు వందల పైచిలుకు గురుకుల హాస్టళ్లను ప్రభుత్వ సంత భవనాలలో ఏర్పాటు చేసి, విద్యార్థులకు తగిన వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా మారుమూల గ్రామాలలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు సరైన వసతులు కల్పించాలని కోరారు. గురుకుల పాఠశాలలు అందుబాటులో లేనందున బీసీ విద్యార్థులు టెన్త్ ఇంటర్ మధ్యలోనే చదువు ఆపేస్తున్నారని, బీసీ విద్యార్థులకు తీరని అన్యాయం జరుగుతుందని అన్నారు. బీసీలకు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలని అన్నారు. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి జనాభా దామాషా పద్ధతిన విద్య, వైద్యం, ఆర్థిక వనరులు, రాజకీయాలలో సమాన వాటా కల్పించాలని కోరారు.