నమస్తే శేరిలింగంపల్లి: బిజెపి రంగారెడ్డి (అర్బన్) జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని శేరిలింగంపల్లి బిజెపి నాయకులు ఎం.రవికుమార్యాదవ్ శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం ఎల్బీనగర్ లోని సామ రంగారెడ్డి కార్యాలయం లో గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, శేరిలింగంపల్లి బిజెపి నాయకులతో రంగారెడ్డిని కలిసిన రవికుమార్యాదవ్ ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నాయకులు గంగల రాధాక్రిష్ణయాదవ్, కర్చర్ల ఎల్లేష్ లతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు.






