నమస్తే శేరిలింగంపల్లి: భారతీయ జనతాపార్టీ రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యుడిగా మియాపూర్ కు చెందిన లీలా ప్రసాద్ నియామితులయ్యారు. ఈ మేరకు రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డి లీలాప్రసాద్‌కు నియామక పత్రాలు అందజేశారు. శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన లీలాప్రసాద్ బిజెపి రాష్ట్ర నాయకులు మొవ్వ సత్యనారాయణ ప్రధాన అనుచరుడిగా కొనసాగుతూ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నాడు. నియామక నేపథ్యంలో లీలా ప్రసాద్ మాట్లాడుతూ జిల్లా కార్యవర్గంలో తనకు చోటు కల్పించిన సామ రంగారెడ్డి, మొవ్వ సత్యనారాయణ, డియస్ఆర్‌కె ప్రసాద్, చింతకింది గోవర్ధన్ గౌడ్ లకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో బిజెపి పార్టీ పటిష్టతకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో బి స్వామి గౌడ్, మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






