నమస్తే శేరిలింగంపల్లి: రంగా రెడ్డి జిల్లా (అర్బన్) బీజేపీ అద్యక్షులు సామరంగారెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని శేరిలింగంపల్లి నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా ప్రధానకార్యదర్శి చింతకింది గోవర్ధన్ గౌడ్ ఆధ్వర్యంలో జిల్లా కార్యాలయంలో నిర్వహించిన జన్మదిన వేడుకల్లో రంగారెడ్డిని కలిసిన నాయకులు కేకు కట్ చేయించి శుభాక్షాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో జిల్లా ఉపాధ్యక్షులు డిఎస్ఆర్కె ప్రసాద్, నాయకులు రామచళ్ల నాగేశ్వర్గౌడ్, మహిపాల్ రెడ్డి, స్వామీ గౌడ్, నారాయణ రెడ్డి, చిట్టారెడ్డి ప్రసాద్, ప్రశాంత్ చారి తదితరులు పాల్గోన్నారు.

జిల్లా బిజెపి అధ్యక్షులు సామరంగారెడ్డితో శేరిలింగంపల్లి నాయకులు





