స‌మాచార హ‌క్కు చ‌ట్టం నిర్వీర్యం చేసిన వారిపై చ‌ర్య‌లు తీసుకోండి: జ‌నం కోసం

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: స‌మాచార హ‌క్కుచ‌ట్టం ద్వారా వ‌చ్చిన ఫిర్య‌దు వివ‌రాల‌ను క‌బ్జాదారుల‌కు అందిస్తూ చ‌ట్టాన్ని నిర్వీర్య‌ప‌రుస్తున్న అధికారుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతూ జ‌నం కోసం స్వ‌చ్చంద సంస్థ అధ్య‌క్షులు క‌సిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి వెస్ట్‌జోన్ క‌మీష‌న‌ర్ ర‌వికిర‌ణ్‌కు ఫిర్యాదు చేశారు. చందాన‌గ‌ర్ స‌ర్కిల్ 21 అధికారులు చ‌ట్టాన్ని నిర్వీర్య ప‌రిచేవిధంగా క‌బ్జాదారులు, అక్ర‌మ నిర్మాణ‌దారుల‌తో కుమ్మ‌క్క‌వుతున్నార‌ని తెలిపారు. సమాచార హక్కు చట్టం అమలుపై తగిన ఆదేశాలిచ్చి సర్కిల్ 21 లో చట్టం అమలును సమీక్షించాలని కోరారు. జ‌నంకోసం ఫిర్యాదుపై స్పందించిన క‌మీష‌న‌ర్ సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా, లేఖ ద్వారా ఆర్డర్ పాస్ చేసిన‌ట్లు భాస్క‌ర‌రెడ్డి తెలిపారు. మరోసారి ఇటువంటి సంఘ‌ట‌న‌లు జరుగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన‌ట్లు తెలిపారు.

జోన‌ల్ క‌మీష‌న‌ర్ ర‌వికిర‌ణ్‌కు విన‌తిప‌త్రం స‌మ‌ర్పిస్తున్న క‌సిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here