నమస్తే శేరిలింగంపల్లి: వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు పూర్తి స్థాయి ‘భారత్ బంద్’కు పిలుపునివ్వగా వామపక్షాలు బంద్ కు సంపూర్ణ మద్దతు తెలిపాయి. ఈ క్రమంలో సీపీఐ శేరిలింగంపల్లి నియోజకవర్గం సంయుక్త కార్యదర్శి రామకృష్ణ ను మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైటెక్ సిటీ విద్యుత్ నగర్ లోని వారి నివాసం వద్ద ముందస్తు అరెస్టు చేసిన పోలీసులు మాదాపూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ నిర్బంధాలతో బంధువులను, నిరసనలను అణచివేసిన్నప్పటికీ ఉద్యమం ఆగదని అన్నారు. రైతులు కార్మికుల ఆవేదన పట్టించుకోని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిలదొక్కుకోలేవని, త్వరలోనే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు.






