శ‌నివారం చందాన‌గ‌ర్‌లో విద్యుత్ ఉండ‌ని ప్రాంతాలు

చందాన‌గ‌ర్‌‌ (న‌మస్తే శేరిలింగంప‌ల్లి): చందాన‌గ‌ర్ స‌బ్‌స్టేష‌న్ 11కేవీ జ‌వ‌హ‌ర్ న‌వోదయ ఫీడ‌ర్ ప‌రిధిలో శ‌నివారం విద్యుత్ స‌ర‌ఫ‌రాను నిలిపివేస్తున్న‌ట్లు తారాన‌గ‌ర్ ఏఈ ర‌విచంద్ర ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. క‌రెంటు తీగ‌ల‌కు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మ‌ల‌ను తొల‌గిస్తున్న నేప‌థ్యంలో ఉద‌యం 10.30 నుంచి మ‌ధ్యాహ్నం 1.30 గంట‌ల వ‌ర‌కు ఆంధ్రా బ్యాంక్ వెనుక వైపు రోడ్డు, న‌ల్ల‌గండ్ల హుడా, హుడా న‌ర్స‌రీ, ఆస్తా గ్రీన్ అపార్ట్‌మెంట్‌, సాయిరాం కాల‌నీ, జ‌వ‌హ‌ర్ నవోద‌య‌, కంచ గ‌చ్చిబౌలి ప్రాంతాల్లో, మ‌ధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు రైల్ విహార్ ఫీడ‌ర్ ప‌రిధిలోని ఓల్డ్ లింగంప‌ల్లి స్టేష‌న్ రోడ్డు, గాంధీ అపార్ట్‌మెంట్, రైల్ విహార్‌, రంగ‌ప్ర‌సాద్ అపార్ట్‌మెంట్‌ల‌లో క‌రెంటు ఉండ‌ద‌న్నారు.

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here