చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ లోని ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ భద్ర అయోధ్య శ్రీ భవ్య రామ మందిర నిర్మాణానికి రూ.51 వేల నిధి సమర్పణ చేశారు. ఈ మేరకు చెక్కును జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ నందకుమార్ యాదవ్, ఆర్ఎస్ఎస్ భాగ్ సహ కార్యవాహ్ యాదగిరి, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి చింతకింది గోవర్ధన్గౌడ్, నాయకులు తోపుగొండ మహిపాల్రెడ్డి, అందెల కుమార్ యాదవ్ లకు అందజేశారు. రామకార్యంలో భాగస్వాములైన భద్రకి వారు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.






