మాదాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం మాదాపూర్ పోలీసులకు లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సున్నం చెరువు లో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృత దేహం పోలీసులకు లభ్యమైంది. మృతుడి వయస్సు సుమారుగా 35-40 సంవత్సరాలు ఉంటుందని, ప్యాంట్, షర్ట్ ధరించి ఉన్నాడని, ఎవరో అతని కాళ్ళు, చేతులను ప్లాస్టిక్ తాడుతో కట్టి సుమారుగా వారం, పది రోజుల కిందట చెరువులో సనత్ నగర్ వైపు ఉన్న చెరువు కట్ట మీద పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు వ్యక్తి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎవరైనా మృతదేహాన్ని గుర్తించదలిస్తే మాదాపూర్ ఇన్‌స్పెక్టర్‌ను 9490617182 ఫోన్ నంబర్‌లో సంప్రదించాలని పోలీసులు సూచించారు.