సీఎంసీ ఎన్‌క్లేవ్ కు రోడ్డును నిర్మించాల‌ని విన‌తి

శేరిలింగంప‌ల్లి‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి డివిజన్‌ పరిధిలో ఉన్న సీఎంసీ ఎన్‌క్లేవ్‌లో స్థానికుల రాకపోకల కోసం రోడ్లను నిర్మించాలని కోరుతూ ఎన్‌క్లేవ్‌ వాసులు జీహెచ్‌ఎంసీ వెస్ట్‌ జోన్‌ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. ఎన్‌క్లేవ్‌లో కేవలం 2 రోడ్లను మాత్రమే నిర్మించలేదన్నారు. దీని వల్ల వర్షాకాలంలో రహదారులు బురదమయంగా మారుతున్నాయని, ఎండాకాలంలో దుమ్ము, ధూళి విపరీతంగా వస్తుందని అన్నారు. బొటానికల్‌ గార్డెన్‌ నుంచి సీఎంసీ ఎన్‌క్లేవ్‌ వరకు ఉన్న అప్రోచ్‌ రోడ్డును అందుబాటులోకి తేవడం వల్ల ఎన్‌క్లేవ్‌లో ఉన్న 6 అపార్ట్‌మెంట్‌ వాసులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. కనుక ఆ రోడ్డును వెంటనే నిర్మించాలని కోరారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here