హఫీజ్ పేట్(నమస్తే శేరిలింగంపల్లి): అయోధ్యలో నిర్మించనున్న భవ్య రామ మందిర నిర్మాణానికి హఫీజ్ పేటకు చెందిన బోయిని వెంకటేష్ యాదవ్ రూ. 51 వేల నిధి సమర్పణ చేశారు. ఆదివారం రామ సేవకులు కనకమామిడి నరెందర్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర నిధి సమర్పణ అభియాన్ కార్యక్రమంలో నిధి సమర్పణ చెక్కును రామ సేవకులకు అందజేశారు. ఈ సందర్భంగా వెంకటేష్ యాదవ్ మాట్లాడుతూ రామ మందిర నిర్మాణ కార్యక్రమంలో పాలు పంచుకునే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. రామ కార్యంలో భాగస్వామ్యం అయినందుకు వెంకటేష్ యాదవ్ కు రామ సేవకులు డాక్టర్ చంద్రభూషణ్ జీ, వంశీకృష్ణ, వెంకటేశ్ ముదిరాజ్, దిలీప్, శ్రీకాంత్, చరణ్ యాదవ్, లడ్డూ యాదవ్ లు కృతజ్ఞతలు తెలిపారు.