శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలో పల్స్ పోలియో కార్యక్రమం ఆదివారం విజయవంతమైంది. చిన్నారులకు ఆరోగ్య సిబ్బంది పల్స్ పోలియో చుక్కలను వేశారు. పలు చోట్ల ప్రజా ప్రతినిధులు, నాయకులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
హఫీజ్‌పేటలో…
5 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న చిన్నారులకు పోలియో చుక్కలు వేయించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆయన చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5 ఏళ్ల లోపు చిన్నారులకు 2 పోలియో డ్రాప్స్ వేస్తే వారి ఆరోగ్యాన్ని కాపాడవచ్చని, ఎలాంటి వైకల్యాలు రాకుండా ఉంటాయని అన్నారు. ప్రభుత్వం ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తుందని, ఇందులో తల్లిదండ్రులు తప్పనిసరిగా తమ పిల్లలకు పోలియో చుక్కలను వేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ తెరాస గౌరవ అధ్యక్షుడు వాలా హరీష్, డివిజన్ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, హోప్ ఫౌండేషన్ ఛైర్మన్ కొండా విజయ్ కుమార్, తెరాస నాయకులు దొంతి శేఖర్, కరుణాకర్ గౌడ్, కంది జ్ఞానేశ్వర్, సుదేశ్ పాల్గొన్నారు.
చందానగర్ డివిజన్ పరిధిలోని వేమన వీకర్ సెక్షన్ కాలనీలోని బస్తీ దవాఖానాలో కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డితో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రవీందర్ రావు, డివిజన్ తెరాస అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, హఫీజ్‌పేట్ డివిజన్ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్, తెరాస నాయకుడు మిరియాల రాఘవ రావు, హోప్ ఫౌండేషన్ ఛైర్మన్ కొండా విజయ్ కుమార్, దాసరి గోపి కృష్ణ, లక్ష్మీ నారాయణ గౌడ్, వెంకటేశ్వర్లు, కరుణాకర్ గౌడ్, ప్రవీణ్, గుడ్ల ధనలక్ష్మి, గురుచరణ్ దూబె, వెంకటేష్, మల్లేష్, యూసఫ్, అంజద్, వరలక్ష్మి పాల్గొన్నారు.
మాదాపూర్ డివిజన్ పరిధిలోని మాతృశ్రీ నగర్ కాలనీ సొసైటీ ఆఫీస్ లో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. మాదాపూర్ డివిజన్ తెరాస అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, హఫీజ్‌పేట డివిజన్ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్, హోప్ ఫౌండేషన్ ఛైర్మన్ కొండా విజయ్ కుమార్, తెరాస నాయకులు కరుణాకర్ గౌడ్, అనిల్ పాల్గొన్నారు.
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని నందమూరి నగర్ జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావుతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. మాదాపూర్ డివిజన్ తెరాస అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, తెరాస నాయకులు దామోదర్ రెడ్డి, కోనేరు కృష్ణ ప్రసాద్, నరసింహరావు, సైదేశ్వర్ రావు, కేఆర్ కేరాజు, శ్రీహరి, అప్పిరెడ్డి, బాబు, సదా బాలయ్య, సదా మహేష్, అష్రఫ్, ఖదీర్, అనిల్, షరీఫ్, హమీద్, ఫసియుద్దిన్, యాసిన్, పద్మ, లతా, పర్వీన్ సుల్తానా, సదా మాధవి, బీజంగ్బీ పాల్గొన్నారు.
కొండాపూర్‌లో…
చిన్నారులు పోలియో బారిన పడకుండా ఉండాలంటే వారికి పోలియో చుక్కలను వేయించాలని కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ సూచించారు. ఆదివారం డివిజన్ పరిధిలోని కొత్తగూడ, అంజయ్య నగర్, శ్రీరామ్ నగర్, ప్రేమ్ నగర్ ఎ & బి బ్లాకులలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమాల్లో కార్పొరేటర్ హమీద్ పటేల్ పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలను వేశారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ హమీద్ పటేల్ మాట్లాడుతూ ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించి, పోలియో బారిన పడకుండా చూసుకోవాలని అన్నారు. చిన్నారుల నిండు నూరేళ్ళ జీవితానికి కేవలం రెండు చుక్కలు వేయించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వెయ్యాలని పిలుపునిచ్చారు. కోవిడ్ జాగ్రత్తలను పాటిస్తూ, బస్తీ దవాఖానాలలో, హాస్పిటల్స్ లో, బస్తీలలో, కాలనీలలో, బస్ స్టాండ్లలో పోలియో చుక్కల కేంద్రాలను ఏర్పాటు చెయ్యటం జరిగిందని, తల్లిదండ్రులు దగ్గరలో ఉన్న కేంద్రానికి తమ చిన్నారులను తీసుకువెళ్లి పోలియో చుక్కలను వేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెరాస సీనియర్ నాయకుడు అన్నం శశిధర్ రెడ్డి, వార్డు మెంబర్స్ గౌరి, రూప రెడ్డి, ఏరియా కమిటీ మెంబర్స్ మంగమ్మ, రవి శంకర్ నాయక్, సెక్రటరీ జె బలరాం యాదవ్, లక్ష్మి నారాయణ, కుమార్, శ్రీరామ్ నగర్ కాలనీ ప్రెసిడెంట్ వెంకట్ రెడ్డి, రాజా మోహన్ రావు, కృష్ణ యాదవ్, డా. మల్లేష్, డా. రమేష్, సత్యం గౌడ్, ప్రభాకర్, లావణ్య, యాదగిరి, యూత్ నాయకులు దీపక్, షేక్ రఫీ, మహ్మద్ ఖాసిమ్, డా ఆసియ బేగం, స్టాఫ్ నర్స్ రజిత, సపోర్టింగ్ స్టాఫ్ సంగారెడ్డి, అంగన్‌వాడీ టీచర్స్ శైలజ, నిర్మల, అరుణ, లావణ్య పాల్గొన్నారు.
గచ్చిబౌలిలో…
గచ్చిబౌలిలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, బీజేపీ నాయకుడు రవికుమార్ యాదవ్‌లు పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఫిబ్రవరి 2వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని, చిన్నారులకు తల్లిదండ్రులు పోలియో చుక్కలను తప్పక వేయించాలని సూచించారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపన్ పల్లి, ఎన్టీఆర్ నగర్, తండా, రాయదుర్గం, నానక్‌రామ్ గూడ, ఖాజాగూడ, గౌలిదొడ్డి, కేశవనగర్ లలో పోలియో చుక్కలు వేశారు.
గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఖాజాగూడ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. 5 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన చిన్నారులకు అందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కోరారు.
శేరిలింగంపల్లిలో…
శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని గోపీనగర్ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ జిల్లా ప్రధానకార్యదర్శి చింతకింది గోవర్ధన్ గౌడ్ చిన్నారులకు పోలియో చుక్కలను వేశారు.
శేరిలింగంపల్లిలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పల్స్ పొలియో కార్యక్రమం చేపట్టిన వాలంటీర్స్ కి ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ అల్పాహారం అందజేశారు. వైద్య అధికారి డాక్టర్ పి.రాం రెడ్డి, సిహెచ్ఓ వీరాస్వామి, అసోసియేషన్ సభ్యులు శివరామకృష్ణ, బాబ్జి పాల్గొన్నారు.
చందానగర్ లో…
పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండేందుకు, ఎలాంటి అంగవైకల్యం లేకుండా ఉండేందుకు 5 సంవత్సరాల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలని బిజెపి చందానగర్ డివిజన్ అభ్యర్థిని కసిరెడ్డి సింధూ రెడ్డి అన్నారు. చందానగర్, ఇందిరానగర్ కమ్యూనిటీ హాల్ లలో సిబ్బందితో కలిసి చిన్నారులకు పోలియో డ్రాప్స్ వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భవిష్యత్ భారతం ఆరోగ్యవంతంగా ఉండాలంటే ప్రభుత్వం చేస్తున్న ఇలాంటి మంచి కార్యక్రమాలను అందరం ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కసిరెడ్డి రఘునాథ్ రెడ్డి, ప్రభాకర్, శ్రీనివాస్ ముదిరాజ్, అంజి, వంశీధర్ రెడ్డి పాల్గొన్నారు.
మియాపూర్ లో…
మియాపూర్ డివిజన్ పరిధిలోని నడిగడ్డ తండా, సుభాష్ చంద్రబోస్ నగర్, శారదా స్కూల్, సెయింట్ రీటా స్కూల్, స్టాలిన్ నగర్, ఎంఏ నగర్‌లలో కొనసాగిన పల్స్ పోలియో కార్యక్రమాల్లో డివిజన్ టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి చంద్రిక ప్రసాద్ గౌడ్ పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.
హఫీజ్‌పేట వార్డు కార్యాలయంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో డివిజన్ తెరాస అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్ పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. 5 ఏళ్ల లోపు వయస్సు ఉన్న చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలని అన్నారు.
పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా బీజేపీ రాష్ట్ర నాయకుడు శ్రీశైలం యాదవ్ చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. చిన్నారులకు పోలియో చుక్కలు వేయించడం వల్ల వైకల్య సమస్యలు రాకుండా ఉంటాయన్నారు.