గచ్చిబౌలి (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని 33/11కేవీ నల్లగండ్ల సబ్ స్టేషన్ పరిధిలో గురువారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. లైన్ నిర్వహణ పనుల నిమిత్తం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నల్లగండ్ల హుడా కాలనీ, తెల్లాపూర్ రోడ్డు, అపర్ణ సైబర్, లేక్ వ్యూ, నల్లగండ్ల విలేజ్, లక్ష్మీ విహార్ ఫేజ్ 1,2, సాయిరాం కాలనీ, కంచ గచ్చిబౌలి, దయ్యం బోర్డ్, డిఫెన్స్ కాలనీ, రత్నదీప్ వెనుక వైపు, నల్లగండ్ల వాటర్ ట్యాంక్, నల్లగండ్ల డిమార్ట్, శ్రీకృష్ణ కాలనీలలో కరెంటు ఉండదన్నారు.