మాదాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ డివిజన్ పరిధిలోని చంద్రనాయక్ తండాలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి డి.సురేష్ నాయక్ బుధవారం సర్కిల్ 21 డీసీ సుధాంష్‌కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా సురేష్ నాయక్ మాట్లాడుతూ తండాలో అసలే ఇరుకుగా ఉన్న వీధుల్లో కొన్ని రోజుల క్రితం కొందరు వ్యక్తులు పైపులను తెచ్చి వేశారని, దీంతో వీధుల్లో నడవడానికి చాలా ఇబ్బంది ఎదురవుతుందని అన్నారు. అలాగే స్థానికంగా నెలకొన్న తాగునీరు, డ్రైనేజీ, రోడ్ల సమస్యలను పరిష్కరించాలని కూడా కోరినట్లు తెలిపారు. ఇందుకు డీసీ సుధాంష్ సానుకూలంగా స్పందించారని అన్నారు.