కొబ్బరికాయల్లో ఉండే నీటిని తీసి తాగేందుకు చాలా మంది కష్టపడుతుంటారు. వాటిని పగలగొట్టి వాటిలోని నీటిని పట్టుకుని తాగుతారు. అయితే అందుకు అంత కష్టపడాల్సిన పనిలేదు. కొబ్బరికాయల నుంచి సులభంగా నీటిని బయటకు తీయవచ్చు. అందుకు ఏం చేయాలంటే..
కొబ్బరికాయ పొట్టును పూర్తిగా తీశాక దానికి ఒక వైపు మూడు కళ్ల లాంటి భాగాలు కనిపిస్తాయి. అయితే వాటిల్లో ఒక కన్ను భాగం కొంచెం మెత్తగా ఉంటుంది. దాన్ని కత్తితో గుర్తించవచ్చు. అలా గుర్తించాక దాన్ని సులభంగా కట్ చేయవచ్చు. దీంతో కొబ్బరికాయలో ఉండే నీటిని సులభంగా బయటకు తీయవచ్చు. అయితే దేవునికి కొట్టే కొబ్బరికాయ అయితే దాన్ని ఇలా చేయలేం. కానీ కేవలం నీటి కోసమే వాటిని కొనేవారికి అయితే ఈ ట్రిక్ ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఇక ఒకప్పుడు కొబ్బరికాయకు ఒక కన్ను మాత్రమే ఉండేదట. కానీ కాలక్రమేణా జీవ పరిణామ క్రమంలో అవి కూడా మార్పులు చెందాయని, అందుకని మూడు కాయలు కలిసి ఒక కాయగా ఏర్పడ్డాయని చెబుతారు. ఇక పురాణాల్లో కొబ్బరికాయలను సాక్షాత్తూ పరమశివుడి స్వరూపమని, అందుకనే వాటికి మూడు కళ్లు ఉంటాయని అంటారు.