శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): నగరంలోని బాగ్ లింగంపల్లిలో ఉన్న ఆర్టీసీ కల్యాణ మండపంలో శనివారం ఆత్మీయ సన్మాన సభ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు అఖిల భారత యాదవ మహాసభ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు భేరి రామచందర్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. సంఘం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు మై కోల్ మహేందర్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో భాగంగా ఇటీవల ఎన్నికల్లో విజయం సాధించిన యాదవ కార్పొరేటర్లను సన్మానించనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యాదవ వర్గీయులు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.






