రాష్ట్రంలో 2 ల‌క్ష‌ల ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేయాలి: బీజేవైఎం

గ‌న్ పార్క్‌‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాష్ ఆధ్వర్యంలో బీజేవైఎం నాయ‌కులు శుక్ర‌వారం గన్ పార్క్ వద్ద అర్ధ‌నగ్న ప్రదర్శన నిర్వ‌హించారు. సీఎం కేసీఆర్ నిరంకుశ పాలనను కొన‌సాగిస్తున్నార‌ని, కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింద‌ని అన్నారు. తెరాస ప్రభుత్వం నిరుద్యోగులకు చెల్లిస్తామన్న‌ నిరుద్యోగ భృతిని తక్షణమే విడుదల చేయాల‌ని, 2 లక్షలకుపైగా ఉద్యోగాల నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాల‌ని, కరోనా కారణంగా 10 నెలలుగా జీతాలు లేక తీవ్ర ఇబ్బందులకు గురైన ప్రైవేట్ టీచర్స్ కు, ప్రైవేట్ లెక్చరర్ల కు తక్షణం 10 నెలల గౌరవ వేతనం ఇచ్చి వారిని ఆదుకోవాల‌ని, ఈడ‌బ్ల్యూ రిజర్వేషన్లను వెంటనే అమలుపరచాల‌ని డిమాండ్ చేశారు. ధర్నా చేసిన బీజేవైఎం నాయకులను అరెస్ట్ చేసి రాంగోపాల్ పేట్, గాంధీనగర్, నారాయణగూడ, చిక్కడపల్లి, ముషీరాబాద్ పోలీస్ స్టేషన్లకు తరలించారు. కాగా ఆ ప్ర‌ద‌ర్శ‌న‌కు శేరిలింగంపల్లి నుండి బీజేవైఎం రాష్ట్ర నాయకులు నందనం విష్ణు దత్‌, చంద్రమోహన్, హరిప్రియ, బీజేవైఎం శేరిలింగంపల్లి అసెంబ్లీ కన్వీనర్ జితేందర్, బీజేవైఎం డివిజన్ అధ్యక్షులు శివ కుమార్, ఆనంద్ కుమార్, నవీన్ రెడ్డి, బీజేవైఎం నాయకులు భాస్కర్, పవన్, శివ, అచ్యుత్ రెడ్డి, సాగర్, అభి, అలోక్, సునీల్, తిలక్, ప‌లువురు నాయకులు త‌ర‌లివెళ్లారు.

గ‌న్‌పార్క్ వ‌ద్ద అర్ధ‌న‌గ్న ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టిన బీజేవైఎం నాయ‌కులు
అర్థ‌న‌గ్న ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టిన అనంత‌రం బీజేవైఎం నాయ‌కుల‌ను పోలీస్ స్టేష‌న్‌లో ఉంచిన దృశ్యం

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here