- కార్యక్రమానికి సీపీ సజ్జనార్‌ను ఆహ్వానించిన సంస్థ ప్రతినిధులు
సైబరాబాద్ (నమస్తే శేరిలింగంపల్లి): కరోనా లాక్‌డౌన్ సమయంలో సేవలు అందించిన యూత్ ఫర్ యాంటీ కరప్షన్ (యాక్) వాలంటీర్లకు ఈ నెల 10వ తేదీన సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్‌ను ఆ సంస్థ ప్రతినిధులు గురువారం కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ఫౌండర్ రాజేంద్ర పల్నాటి, సంస్థ మీడియా సెక్రటరీ జి. జయరాంలు సీపీని సదరు సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాలని ఆహ్వానించారు.

ఈ సందర్బంగా రాజేంద్ర, జయరాంలు మాట్లాడుతూ.. తమ సంస్థ ఆధ్వర్యంలో ఎంతో మంది వాలంటీర్లు కరోనా లాక్ డౌన్ సమయంలో వృద్దులు, వికలాంగులు, గర్భిణీలకు సేవలను అందించారని తెలిపారు. అందులో భాగంగానే వాలంటీర్లను సన్మానించనున్నామని అన్నారు. ఆ కార్యక్రమాన్ని ఈ నెల 10వ తేదీన నగరంలో నిర్వహించనున్నామని, ఆ కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తమ సంస్థ ప్రతినిధులు, వాలంటీర్లు హాజరు అవుతారని తెలిపారు.





