- నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టి శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ కు కలిసి శుభాకాంక్షలు తెలిపిన బిజెపి బృందం
- అనంతరం సమస్యలు పరిష్కరించాలని వినతి
నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ గా నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన శ్రీనివాస్ రెడ్డి కి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఇందులో భాగంగా గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్ బీజేపీ శ్రేణులతో వెళ్లి ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. పూలబొకే అందించి సన్మానించారు. అనంతరం నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయనకు విన్నవించారు. ఇందుకు జోనల్ కమిషనర్ స్పందిస్తూ తమ దృష్టికి తీసుకువచ్చిన ప్రతి సమస్యపై తగు చర్యలు తీసుకుని పరిష్కరించే దిశగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.