శేరిలింగంపల్లి, మార్చి 2 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి మండలం పరిధిలోని కొండాపూర్, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, మాదాపూర్, మియాపూర్, హఫీజ్‌పేట్, చందానగర్ , భారతి నగర్ (పార్ట్) డివిజన్ల పరిధిలోని పలువురికి కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా మంజూరైన రూ.2,50,29,000 ఆర్థిక సహాయాన్ని 250 మంది లబ్ధిదారులకు మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మాజీ కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్, నార్నె శ్రీనివాసరావు, సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డితో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ చెక్కుల రూపేణా అందజేశారు. ఈ సందర్బంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ పేదల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుంది అని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల పక్షపాతి అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు, మాజీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.






