- జోనల్ కమిషనర్ స్నేహ శబరిష్ కి గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి వినతి
నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం, శేరిలింగంపల్లి మున్సిపల్ కార్యాలయంలో జోనల్ కమిషనర్ స్నేహ శబరిష్ ని గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆమెతో సమావేశమై గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపనపల్లి గ్రామం, రాజీవ్ నగర్ కాలనీ, కేశవ నగర్, రాయదుర్గం, నల్లగండ్ల హుడా కాలనీ లో సీసీ రోడ్డు పరిష్కారానికి మార్గం చూపు వలసిందిగా కోరారు. ఈ మేరకు వినతి పత్రం అందజేశారు.
అనంతరం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ తో సమావేశమై గచ్చిబౌలి డివిజన్ పరిధిలో నెలకొన్న సమస్యలపై, చేపట్టవలసిన అభివృద్ధి పనులపై, కొనసాగుతున్న అభివృద్ధి పనులపై ప్రత్యేకంగా చర్చించారు. పెండింగులో ఉన్న పనులను వెంటనే ప్రారంభించి త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మన్నే రమేష్ పాల్గొన్నారు.