నమస్తే శేరిలింగంపల్లి : ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో వర్షాకాలంలో వచ్చే వ్యాధులు – నివారణ చర్యలపై అవగాహన కరపత్రాన్ని ముద్రించారు. ఈ కరపత్రాన్ని కొండాపూర్ లోని రంగారెడ్డి జిల్లా హస్పిటల్ సివిల్ సర్జన్ – జిల్లా వైద్యసేవల సమన్వయ కర్త కార్యాలయంలో డాక్టర్ జి. రాజు యాదవ్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు వర్షకాలం వ్యాధులపై అవగాహన కల్పించారు. “వర్షాకాలంలో వాతావరణంలో తేమ ఎక్కువగా ఉంటుందని, బ్యాక్టీరియా, వైరస్ లు, ఫంగస్, దోమలు వృద్ధి చెందేందుకు అనువైన కాలమన్నారు. వర్షాకాలంలో ఇమ్యుూనిటీ కొంత తగ్గి శరీరం బలహీన పడుతుందని, దీనివలన అనేక ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. వర్షాకాలంలో జలుబు, దగ్గు, గొంతులో కఫం, వైరల్ ఫివర్ లాంటి వాటి బారిన పడతారని, దోమల బెడద ఎక్కువగా ఉండటం వలన అతిసారం, డెంగ్యూ, మలేరియా, మెదడువాపు లాంటి ప్రమాదకర వ్యాధులు ప్రబలే అవకాశాలు అధికంగా ఉన్నాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ వ్యాధుల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు మారబోయిన సదానంద యాదవ్, వాణి సాంబశివరావు, ధర్మసాగర్, బాలన్న, జాకీర్ పాల్గొన్నారు.