- ఆరోగ్యశాఖ మంత్రి రాజనర్సింహకు వినతి
- ఎం. బి .బీ. ఎస్ పేరుతో ప్రభుత్వం అనుమతులు లేకుండా రైడింగ్ చేసి కేసులు పెడుతున్నారని రాష్ట్ర కార్యదర్శి రమేష్ ఆవేదన
నమస్తే శేరిలింగంపల్లి : ఆర్.ఎం.పీ & పి.ఎం.పీ డాక్టర్ల పై దాడులు ఆపాలని, తెలంగాణ ఐక్య పట్టణ గ్రామీణ ఆర్ఎంపి, పిఎంపి వైద్య సంఘం ఆధ్వర్యంలో వారి సమస్యలను ఆరోగ్యశాఖ మంత్రి రాజనర్సింహకి వినతి పత్రం ద్వారా విన్నవించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఐక్య పట్టణ గ్రామీణ ఆర్ఎంపి, పీఎంపీ వైద్య సంఘం రాష్ట్ర కార్యదర్శి రమేష్ ఆర్ ఎంపీ పి ఎంపీ డాక్టర్ల సమస్యలు మంత్రిని కలిసి వివరించారు.
తెలంగాణ రాష్ట్రంలో 45 వేల జనాభా ఉన్నామని, రైడింగ్ల పేరుతోటి ఎం. బి. బీ .ఎస్ డాక్టర్లమని, తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆమోదితితో జిల్లా. డి ఎం హెచ్ ఓ సహకారంతో రైడింగ్ చేయడానికి వస్తున్నామని బెదిరిస్తూ తమపై కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్లు చేపిస్తున్నారని మంత్రి తెలిపారు. 50 ఏండ్ల నుండి 20, 30 రూపాయల నుంచి పేద ప్రజలకు వైద్యం చేస్తున్నామని, గ్రామీణ ప్రాంతాలలో అత్యవసర సేవలో తామే ముందుండి వైద్యం అందిస్తున్నామని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. తమ ఆర్ఎంపీ, పిఎంపి డాక్టర్లకు సర్టిఫికెట్లతో పాటు ట్రైనింగ్ కూడా ఇప్పించగలరని కోరుకున్నారు. వైయస్సార్ గవర్నమెంట్ లో ట్రైనింగ్ తో పాటు, సర్టిఫికెట్లు కూడా రెడీ చేశారని తెలిపారు. జీవో కూడా పాస్ చేశారని, తరువాత ఆయన చనిపోవడం వలన ఇవన్నీ ఆగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఆర్.ఎం.పి పి ఎం పీల సమస్యలు పరిష్కరించాలని బెదిరింపులకు పాల్పడుతున్న వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.