నమస్తే శేరిలింగంపల్లి : ప్రేమ వైఫల్యం కారణంగా ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గజ్జల నాగచక్రపాణి (28) ఐటీ ఉద్యోగిగా పనిచేస్తూ గచ్చిబౌలిలోని సాన్విక పీజీలో నివసిస్తున్నాడు.
20వ తేదీన బెడ్ షీట్ తో సీలింగ్ ఫ్యాన్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని మధు అనే వ్యక్తి మృతుడి తండ్రి గజ్జ నాగశేషులు (60) కి తెలిపాడు. ఓ మహిళతో ప్రేమలో పడ్డాడని, ప్రేమ వైఫల్యం చెందడంతో ఉరివేసుకున్నట్లు చెప్పాడు. దీంతో నాగశేషులు మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.