నమస్తే శేరిలింగంపల్లి : అన్నమాచార్య భావనా వాహిని అధ్యక్షులు, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ శోభా రాజు సారధ్యంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉదయం శ్రీ స్వరసిద్ధి వేంకటేశ్వర స్వామికి ఉత్తర ద్వారదర్శనం 23న సాయంత్రం 5 గంటల నుంచి 24వ తేదీ ఉదయం 6 వరకూ అన్నమయ్య కీర్తనలకు వివిధ సంస్ధల నుండి సంగీత, నృత గురుశిష్యులచే 12గంటల పాటు నిర్విరామంగా కార్యక్రమం నిర్వహించనున్నారు.
ఇందులో భాగంగా పద్మశ్రీ డా. శోభా రాజు స్వయంగా వయోభేదం లేకుండా “వైకుంఠ వాసం భజే” అనే పాట ఉచితంగా నేర్పించనున్నారు. ఆసక్తి గల వారు 9848024042 నంబరును సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలని అన్నమాచార్య భావనా వాహిని ప్రోగ్రామ్ ఆఫీసర్ రమణ కుమార్ సూచించారు.