ఉత్సాహంగా ముత్యాల ముగ్గుల పోటీలు

  • ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్, కొమిరిశెట్టి ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో కొండాపూర్ పరిధిలోని 8వ బెటాలియన్ క్యాంపస్ వద్ద పోటీలు
  • ముఖ్యఅతిథిగా హాజరైన 8వ బెటాలియన్ రిజర్వ్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ ఎం. శ్రీనివాస్ 
  • విజేతలకు బహుమతులు అందజేత

నమస్తే శేరిలింగంపల్లి : సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని శేరిలింగంపల్లి జంటసర్కిళ్ళ పరిధిలోని 30 కాలనీలలో ముత్యాల ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్, కొమిరిశెట్టి ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. పోటీలలో గెలుపొందిన ప్రతి కాలనీకి ప్రథమ, ద్వితీయ, తృతీయ 5 కన్సొలేషన్ ప్రోత్సాహక బహుమతులు అందజేస్తున్నట్లు కొమిరిశెట్టి ఫౌండేషన్ ఛైర్మన్ కొమిరిశెట్టి సాయిబాబా, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయినరామస్వామి యాదవ్ తెలిపారు.

కొండాపూర్ డివిజన్ పరిధిలోని 8వ బెటాలియన్ క్యాంపస్ వద్ద నిర్వహించిన పోటీల్లో ముగ్గుల వేస్తున్న మహిళలు

ఇందులో భాగంగా కొండాపూర్ డివిజన్ పరిధిలోని 8వ బెటాలియన్ క్యాంపస్ వద్ద మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. వంద మందికి పైగా మహిళలు పాల్గొని చూడముచ్చటగా రంగవల్లికలు వేశారు. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులు అందజేసిన తరువాత సాయిబాబా, రామస్వామి యాదవ్ మాట్లాడుతూ “ఆరోగ్యాన్ని, పారిశుధ్యాన్ని, విజ్ఞానాన్ని మేళవించే సనాతన సాంప్రదాయమే ఇంటి ముందు ముగ్గులు వేయడం” అని అన్నారు. ప్రాచీన సంస్కృతి సంప్రదాయాలు కనుమరుగవుతున్న ప్రస్తుత తరుణంలో మన సంస్కృతి సంప్రదాయాలను భవిష్యత్తు తరానికి అందించడానికి, మహిళలలో ఉన్న సృజనాత్మక శక్తిని వెలికి తీయడానికి ఈ పోటీలను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.

విజేతలకు బహుమతులు అందజేసిన 8వ బెటాలియన్ రిజర్వ్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ ఎం. శ్రీనివాస్ 

ఈ పోటీలకు న్యాయ నిర్ణేతగా తాటిచర్ల వరలక్ష్మి వ్యవహరించారు. ముఖ్య అతిథిగా 8వ బెటాలియన్ రిజర్వ్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ ఎం. శ్రీనివాస్ విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు వాణి సాంబశివరావు, కార్యక్రమ ఆర్గనైజర్ తన్వీర్ బేగం పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here