రక్తదానంతో ప్రాణాలు కాపాడుదాం : కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు మారబోయిన రఘునాథ్ యాదవ్

  • యువజన కాంగ్రెస్ 63వ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా రక్తదాన శిబిరం ఏర్పాటు

నమస్తే శేరిలింగంపల్లి: క్విట్ ఇండియా దినోత్సవం సందర్భంగా చందానగర్ డివిజన్ లో యువజన కాంగ్రెస్ 63వ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా సెయింట్ థెరిస్సా హాస్పిటల్ బ్లడ్ సెంటర్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు మారబోయిన రఘునాథ్ యాదవ్ హాజరై రక్తదాతలను ఉద్దేశించి మాట్లాడారు.

అనంతరం క్విట్ ఇండియా ప్రాధాన్యతను గురించి మాట్లాడారు. సమయానికి రక్తం అందక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని వివరించారు. ఇలాoటి రక్తదాన శిబిరాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న కొందరినైనా కాపాడవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు దుర్గేష్, నాయకులు సౌందర్య రాజన్, మహిపాల్ యాదవ్, వివి చౌదరి, రాజేందర్ రెడ్డి, ముషరాఫ్, కిషోర్, రాజు, కార్తీక్ సామ్యూల్, భారత్ యాదవ్, కిరణ్ రెడ్డీ, సూర్య రాథోడ్, రాజేష్ యాదవ్, హమీద్ ఉన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here