నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద, మధ్య తరగతి కుటుంబాలకు వారు నివసిస్తున్న ప్రాంతంలో ఆస్తి హక్కులను కల్పిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా శేరిలింగంపల్లి మండలంలోని కొండాపూర్, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, మాదాపూర్, మియాపూర్, హఫిజ్ పేట్, చందానగర్, భారతి నగర్ డివిజన్ల పరిధిలో దరఖాస్తు చేసుకున్న లభ్డిదారులకు జీవో 58 ద్వారా యజమాని హక్కులను కల్పిస్తూ ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. తహశీల్దార్ వంశీ మోహన్, కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్, జగదీశ్వర్ గౌడ్, మంజుల రఘునాథ్ రెడ్డి తో కలిసి అందజేసిన అనంతరం మాట్లాడారు.
నిరుపేదలకు అండగా ఉండేది ముఖ్యమంత్రి కేసీఆర్ అని.. దశాబ్దాలుగా నివాసం ఉంటున్న నిరుపేదలకు జీవో నెంబర్ 58 ప్రకారం వారికి రెగ్యులరైజ్ చేసి జీవితంపై భరోసా కల్పించిన గొప్ప మహానుభావుడు అని కొనియాడారు. కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు ఆర్ ఐ శ్రీకాంత్, శ్రీనివాస్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డ్ మెంబర్లు, ఏరియా కమిటీ మెంబర్లు, ఉద్యమకారులు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, పాత్రికేయ మిత్రులు, కాలనీ వాసులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.