- రూ.5 కోట్ల 41 లక్షల 50 వేల అంచనావ్యయంతో అభివృద్ధి పనులు
- కార్పొరేటర్ హమీద్ పటేల్ తో కలిసి శంకుస్థాపన
నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోకజకర్గంను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన, అగ్రగామి నియోజకవర్గంగా తీర్చిదితానని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రేమ్ నగర్ ఏ బ్లాక్, రాఘవేంద్ర కాలనీ సి బ్లాక్, రాజరాజేశ్వరి కాలనీ, గోల్డెన్ తులిప్, ఓయూ కాలనీ, జేవి హిల్స్ కాలనీ, గచ్చిబౌలి ప్రధాన రహదారి కిరువైపుల ఫుట్ ఫాత్ నిర్మాణం, మాదాపూర్ విలేజ్, అమర్ సొసైటీ కాలనీలలో రూ.5 కోట్ల 41 లక్షల 50 వేల అంచనావ్యయంతో చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణ పనులకు, ఫుట్ పాత్ నిర్మాణం పనులకు కార్పొరేటర్ హమీద్ పటేల్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు.
ప్రేమ్ నగర్ ఏ బ్లాక్ కాలనీలో రూ. 90 లక్షలతో.. రాఘవేంద్ర కాలనీ సి బ్లాక్ కాలనీలో రూ.30 లక్షలతో.. రాజరాజేశ్వరి కాలనీలో రూ. 40 లక్షలతో .. గోల్డెన్ తులిప్, ఓ యు కాలనీ, జేవి హిల్స్ కాలనీలో రూ. 1కోటి 4 లక్షలతో సిసి రోడ్లు… గచ్చిబౌలి ప్రధాన రహదారి పై ( గచ్చిబౌలి విధి నంబర్ 2 నుండి బొటానికల్ గార్డెన్ జంక్షన్ వరకు నూతనంగా చేపట్టబోయే ఫుట్ ఫాత్ నిర్మాణం, ఆదిత్య హైట్స్ నుండి పీజే ఆర్ నగర్ వరకు నూతనంగా చేపట్టబోయే ఫుట్ ఫాత్ నిర్మాణం) రూ.2కోట్ల 29 లక్షల రూపాయల అంచనావ్యయంతో నూతనంగా చేపట్టబోయే ఫుట్ ఫాత్ నిర్మాణ .. మాదాపూర్ విలేజ్ , అమర్ సొసైటీ కాలనీలో రూ. 48 లక్షల అంచనావ్యయంతో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసినట్లు ప్రభుత్వ విప్ గాంధీ తెలిపారు. అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని, నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడకూడదని అధికారులకు ఆదేశించారు.
కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నీలం రవీందర్ ముదిరాజ్, మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుండ్ల శ్రీనివాస్ యాదవ్, బీఆర్ ఎస్ పార్టీ నాయకులు పెరుక రమేష్ పటేల్, సీనియర్ నాయకులు రక్తపు జంగం గౌడ్, రూపరెడ్డి, శ్రీనివాస్ చౌదరి, కే నిర్మల, మీనా భి, నరసింహ సాగర్, మల్లెల శ్రీనివాస్ యాదవ్, రాజు యాదవ్, శ్రవణ్ యాదవ్, బద్దం శాస్త్రి యాదవ్, సిల్వర్ కుమ్మరి శ్రీనివాస్, ఇంద్రాసేన ముదిరాజ్, సిల్వర్ విష్ణు, రాము ముదిరాజ్, మల్లెల ఐలేష్ యాదవ్, మహేష్ యాదవ్, విక్రమ్, బాలిరెడ్డి, జూపల్లి శ్రీనివాస్, ఎస్వీఎన్ రాజు, మంగళరాపు తిరుపతి పటేల్, రజనీకాంత్, డా రమేష్, మంగమ్మ, తిరుపతి యాదవ్, రాజరాజేశ్వరి కాలనీ వైస్ ప్రెసిడెంట్ మధు ముదిరాజ్, శ్రీనివాస్ ముదిరాజ్, అజయ్ సింగ్, శీను ముదిరాజ్, విశ్వేశ్వరరావు, సత్యనారాయణ రెడ్డి, అనిల్, సత్య ప్రసాద్, విజయ్, శివ ముదిరాజ్, సంతోష్, నరేష్ ముదిరాజ్, కచ్చావా దీపక్, సయ్యద్ ఉస్మాన్, హిమమ్, అజయ్, సంతోష్, వివి రావు, హనుమంతు రావు, భగవాన్ దాస్, వినయ్ పాల్గొన్నారు.