శ్రీకృష్ణుడి రూపంలో.. ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్టాపనను ఉపసంహరించుకోవాలి

  • జాతీయ బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భేరి రామచందర్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: యాదవులు, హిందువుల మనోభావాలను ఉద్దేశపూర్వకంగానే బంగపరుస్తున్నారంటూ.. ఖమ్మం పట్టణంలో శ్రీ కృష్ణుని రూపంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టడాన్ని జాతీయ బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భేరి రామచందర్ యాదవ్, శేరిలింగంపల్లి యాదవ సంఘం ఖండించింది.

శ్రీకృష్ణుడి రూపంలో.. ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్టాపనను ఉపసంహరించుకోవాలంటూ..

స్వర్గీయ నందమూరి తారక రామారావు కేవలం శ్రీకృష్ణుని పాత్ర మాత్రమే చేశారని, ఆయన సాక్షాత్తు శ్రీ కృష్ణ భగవానుడు కాదన్నారు. అనంతరం శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ యాదవులు, హిందువుల మనోభావాలు దెబ్బతీసే చర్యలు ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కృష్ణ యాదవ్ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నుంచి ఖమ్మం జిల్లాకు వెళ్లి అక్కడ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి తీవ్ర నిరసన వ్యక్తం చేస్తామని అన్నారు. శేరిలింగంపల్లి విలేజ్ డెవలప్ మెంట్ ఉపాధ్యక్షులు సోమయ్య యాదవ్, మేకల కృష్ణ యాదవ్, విలేజ్ డెవలప్ మెంట్ కమిటీ అధ్యక్షుడు గడ్డం రవి యాదవ్ మాట్లాడుతూ.. యాదవులంతా ఏకమై వాడవాడలో ప్రతి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున నిరసన జ్వాలాలు రగులుస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ అధ్యక్షులు నాగపురి అశోక్ యాదవ్, పాశం రాజు యాదవ్ సంఘం ఉపాధ్యక్షులు, అందాల కిషోర్ యాదవ్ యూత్ ప్రెసిడెంట్, వాష్రూమ్ కిషోర్ యాదవ్ బిఆర్ఎస్ సెక్రెటరీ, పి. సాయి యాదవ్ జనరల్ సెక్రెటరీ, బాలరాజ్ యాదవ్, రేవంత్ యాదవ్, రమేష్ యాదవ్, బాలరాజ్ యాదవ్, శీను ముదిరాజ్, రాజేష్ గౌడ్, మల్లేష్ యాదవ్ రాకేష్ ముదిరాజ్, దేవేందర్ యాదవ్, యాదవ సంఘం నాయకులు బీసీ సంఘం నాయకులు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here