- బిఆర్ఎస్ నాయకులను ప్రశ్నించిన బిజెపి రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: కూకట్ పల్లి పటేల్ కుంట పార్క్ బిజెపి పార్టీ కార్యాలయంలో గడపగడపకు బిజెపి రవన్న ప్రజా యాత్ర సన్నాహక సమావేశం నిర్వహించారు. హైదర్ నగర్ డివిజన్ కు సంబంధించిన ముఖ్య నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో బిజెపి రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్ మాట్లాడారు. కొన్ని రోజులుగా గడపగడపకు బిజెపి కార్యక్రమాన్ని చేపట్టి ప్రజా సమస్యలను తెలుసుకుంటూ సాధ్యమైనంత వరకు వాటిని పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నామని, ఇందులో భాగంగా సోమవారం హైదర్ నగర్ డివిజన్లో గడపగడపకు బిజెపి సన్నాహక సమావేశం నిర్వహించామని తెలిపారు. కేటీఆర్ జిహెచ్ఎంసి ఎన్నికలలో దత్తత తీసుకున్న ఈ డివిజన్ అభివృద్ధికి ఎందుకు నోచుకోలేదో.. స్థానిక ప్రజాప్రతినిధులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పాదయాత్రలో తమతో అందరూ కలసి నడవాలని ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు నవీన్ గౌడ్, సీనియర్ నాయకులు అరుణ్ కుమార్, చారి, వేణుగోపాల్ యాదవ్, కృష్ణంరాజు, సీతారామరాజు, రాజా రెడ్డి, చంద్రమౌళి, బాలాజీ, నివంతి, నర్సింగ్, వీరు యాదవ్, నాగిరెడ్డి, శ్రీనివాస్, కృష్ణ కుమార్, పృథ్వీరాజ్, సూర్య, ప్రభాకర్, అభిషేక్, బాలయ్య, నరేష్ , కృష్ణ ,సైదమ్మ మొదలగు పాల్గొన్నారు.